చేనేత గర్జన సభకు హాజరైన పవన్ కళ్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్గుంటూరులో ఏర్పాటు చేసిన చేనేత సత్యాగ్రహ దీక్షకు హాజరయ్యారు. గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గల విశాలమైన ప్రాంగణంలో ఈ దీక్ష జరుగుతోంది. దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింప జేశారు పవన్ కళ్యాణ్. తన పూర్తి మద్దతును చేనేత కార్మికులకు తెలియజేస్తున్నట్టు ప్రకటించారు. చేనేత కార్మికులతో కాసేపు ముచ్చటించిన పవన్ కళ్యాణ్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పూజారులు పవర్ స్టార్ పేరు మీద అర్చన చేసి, దీవించారు.
ఈ గర్జన సభకు తెలుగు రాష్ట్రాలనుంచి చేనేత కార్మికులు, వారికి మద్దతిచ్చే వివిధ సంఘాల వారు హాజరయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ వీరాభిమానులు వేలల్లో పాల్గొన్నారు. స్టేడియం జనంతో కిక్కిరిసి పోయింది. ఈ సభకు పోలీసులు 300 మందితో బందోబస్తును ఏర్పాటు చేశారు.

Leave A Comment