చేనేత రంగానికి సమంత మద్దతు

సినీనటి సమంత మంగళవారం తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిశారు. కేటీఆర్ చేనేత రంగానికి చేయూత ఇవ్వలని సినీ, క్రీడా, రాజకీయ రంగ ప్రముఖులను కోరారు. ఈ నేపథ్యంలో సమంత చేనేతకు మద్దతు ప్రకటించేందుకు మంత్రిని కలిశారు. రాష్ట్ర చేనేత సహకార సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు ఆమోదం తెలిపారు. ఆ సంస్థతో కలిసి పనిచేస్తానని తెలిపారు. అనంతరం మంత్రీ కేటీఆర్ సమంతకు పోచంపల్లి చీరను బహుకరించారు. సమంతకు సినీ నటుడు నాగ చైతన్యతో రెండు రోజుల క్రితం నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని కుటుంబంలో ఒకరిగా మారిన సమంత వారినే అనుసరిస్తోంది. ఇప్పటికే నాగార్జున, అమల చేనేత రంగానికి మద్దతు తెలపడంతో పాటూ వారానికి ఒకరోజు నేత దుస్తులు ధరిస్తామని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తాజాగా సమంత కూడా కాబోయే అత్తామామల బాటలోనే నడుస్తోంది.

Leave A Comment