మన చేనేతకు పునర్వైభవం వచ్చేనా!

ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన భారతీయ చేనేత రంగం నేడు ప్రాభవం కోల్పోయింది. చేనేత రంగానికి పునర్వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో ఏటా ఆగష్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నిర్ణయించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు ఘనమైన చరిత్రే ఉంది. అటు తెలంగాణలోనూ, ఇటు ఆంధ్రలోనూ వేలాది కుటుంబాలు చేనేతపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పోచంపల్లి, ఉప్పాడ, మంగళగిరి, ధర్మవరం చీరలకు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చక్కటి […]

చాన్నాళ్ల తర్వాత మళ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా పవన్

సాధారణంగా వాణిజ్యపరమైన ఉత్పత్తులకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటానికి నేను ఇష్టపడను కానీ చేనేత ఉత్పత్తులు మన జాతి సంపద కనుక చేనేత వస్త్రాలకి ఇకపై బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తాను అని అన్నారు సినీనటుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌‌లో తనని కలిసిన తెలుగు రాష్ట్రాల చేనేత సంఘాల నేతలతో మాట్లాడిన అనంతరం పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయడమేకాకుండా ఇరు రాష్ట్రాల్లో వారి హక్కుల కోసం జనసేన పార్టీ[…..]